disable copy paste

Thursday, April 5, 2018

My Mother Tongue

Born in a telugu state, I never realized the greatness of this language. Thanks to mom and dad for contributing greatly to this article. 

ఓం
తెలుగు భాష ఔన్నత్యము
మా తెలుగు తల్లికి మల్లె పూదండమా కన్నతల్లికి మంగళారతులు
తేనెలూరు భాష తెలుగు భాష - దేశ భాషలందు తెలుగు భాష లెస్స
కోటి రతనాల వీణ నా వీర తెలంగాణ

శతాబ్దాల భాష తెలుగు భాష. భాష అంటే "భాషింపబడేది" అని అర్ధం.  భాష అంటే ధ్వనుల సముదాయం. భాష మానవుణ్ణి సంఘ జీవిగా మారుస్తుంది. భాష, భావాన్ని వ్యక్తీకరించటానికి, భావాన్ని గ్రహించటానికి వారధి. తెలుగు వర్ణమాలలో అక్షరములు 56, అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు. అక్షరము అంటే క్షరము కానిది. భారత దేశంలో ఎక్కువగా మాట్లేడే భాషలలో తెలుగు 3వ స్థానంలో వుంది. తెలుగు ప్రాచీన భాషగా గుర్తింబడినది. ప్రపంచ భాషా లిపులలో తెలుగు లిపి రెండవ అందమైన లిపిగా ఎన్నుకోబడినది. అన్ని భాషలలో కంటే తెలుగు లోనే ఎక్కువగా సామెతలు వున్నాయి. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు 72 వేల న్యూరాన్లు వుద్దీపన చెందుతాయ ని ఒక శాస్త్ర నిరూపణ.

Telugu Language is centuries old. Language is for communication. Language is a collection of sounds that unite people. Its a bridge to express and grasp feelings. In Telugu, Letters are divided into vowels, consonants and duals. Telugu language consists of 56 letters. Letter is ‘Aksharam’ which means "which does not die". Telugu is the 3rd most spoken language in India. It is recognized as a "Classical" language. Telugu lipi or the script is voted as the Second Best Script in the World. It also has the most number of idioms. Scientific study says that speaking in telugu activates 72000 Neurons in the human body.

తెలుగు లోని ప్రతిపదం "అచ్చుతో"(Vowel)  అంతమౌతుంది. అలా అచ్చులతో అంతమయ్యే భాషలను "అజంతా" భాష అని అంటారు. ఇలా కొద్ది భాషలు మాత్రమే అచ్చుతో అంతమౌతాయి. వాటిలో ఇటాలియన్ భాష ఒకటి. అందుకని ఇటలీ యాత్రికుడు "నికోలొ" మన భాషను "ద ఇటాలియన్ ఆఫ్ ద ఈష్ట్" గా అభివర్ణించాడు.

Every word in Telugu ends with a vowel. There are a very few languages that have a vowel at the end and these are called ‘Ajanta Languages.’ Italian is one among them. Italian traveler Nicole De Conti, called Telugu as “the Italian of the East”.

మన తెలుగు భాష దశ దిశలా వ్యాపించింది. మయన్మార్ దేశం లో ఒక వీధి పేరు "మల్లెపూలదిబ్బ". మారిషస్ లోని ఒక ప్రాంతం లో రేడియో ఛానల్ లో తెలుగు ప్రసారాలు జరుగుతాయిట. శ్రీలంక ఒక ప్రాంత ప్రజలు తెలుగులోనే మాట్లాడుతారు. వారిని శ్రీలంకన్ జిప్సీలు అంటారు.

Telugu is popular in foreign countries as well. There are streets in mayanmar named in telugu: ‘Mallepoola dibba’. Radio Plus Indiz is a telugu radio channel in Mauritius. Telugu is spoken in Sri Lanka. They are known as Sri Lankan Gypsy people.

శబ్దాలను విభజించునది "వ్యాకరణం". విషిష్టమైన ఆకృతి, శాస్త్ర బద్ధమైనది వ్యాకరణం. 13వ శతాబ్దములో మూలఘటిక కేతన "ఆంధ్ర భాషా భూషణం" అనే పేరుతో ప్రాచీన తెలుగులో వ్యాకరణం వ్రాసారు. ఆధునిక భాషలో తెలుగుకి సుబోధకమైన వ్యాకరణాన్ని రచించిన పండితుడు శ్రీ పరవస్తు చిన్నయ సూరి.

The division of the sounds in a specific structure of the words is grammar. Telugu grammar is highly scientific. The first available book on Telugu Grammar is written during 13th century, by Scholar sri Mula Ghatika Ketana. Scholar Sri Pravastu Cinnaya Suri made the Grammar Practical and easy for the modern generation.

భాషా శాస్త్రవేత్తల అంచనా ప్రకారం తెలుగు భాష కనీసం 2400 ల సంవత్సరాలకు పూర్వం మూల ద్రావిడ, ప్రాచీన భాష నుంచి వేరు పడి ప్రత్యేక భాష గా స్థిర పడినది. వాల్మీకి రచించిన "రామాయణ మహా కావ్యం" లో కూడా ఆంధ్రుల గురించిన ప్రస్థావన కలదు. క్రీ.పూ. పరిపాలించిన శాతవాహనుల కాలంలో "హాల కవి" రచించిన "గాధా సప్తశతి" అను పద్య సంకలనంలో తెలుగు పదాలు మొదట కనిపించాయి. క్రీ.శ. 11వ శతాబ్ది నుంచి తెలుగు భాష గ్రంధస్తం చేయబడినది. మౌర్యుల కాలంలో నిర్మించిన బౌద్ధ స్తూపం లోని శాసనాలలో బ్రహ్మి లిపిని పోలిన అక్షరాలు గుంటురు జిల్లా లోని భట్టిప్రోలు లో లభించాయి.

According to the language researchers, Telugu originated from Old Dravidian Language around 2400 years ago and is recognized as a independent language. A reference is found in Valmiki Ramayana about Andhra and Telugu Speaking People. According to the Western archeologists, telugu like words were found on “Buddha Pillar”. This was constructed by Mourya Dynasty around 272 BC, at Bhattiprolu near Guntur district. Telugu Words were found in ‘Gadha Sapthasati’, written by Poet Hala. Telugu literature has been written and stored since the 11th century BC.

11 వ శతాబ్దంలో రచించిన "ఆది కవి" అని బిరుదు పొందిన నన్నయ్య భట్టు రచించిన "ఆంధ్ర మహా భారతం" తెలుగు ఆది కావ్యము. ఆయన ఆంధ్ర మహా భారతం లోని కొన్ని పర్వాలను రచించారు. మిగిలిన పర్వాలను "తిక్కన సోమయాజులు" "ఎఱ్ర్రా ప్రగడ" లు పూర్తి చేసినారు. వారి ముగ్గురిని కలిపి "కవిత్రయం" అని అంటారు. బమ్మెర పోతనా మాత్యులు తెలుగులో వ్రాసిన భాగవతం ప్రసిద్ది పొందిన కావ్యం. శ్రీనాధ కవి రచించిన "శృంగార నైషధం", కవి మొల్ల వ్రాసిన "మొల్ల రామయణం" ప్రసిద్ద గ్రంధములు.

‘Andhara Maha Bharatam’ is a great piece of literature written in 11th century by the first telugu poet ‘Aadi kavi Nannayya Bhattu’. ‘Andhara Maha Bharatam’ is mahabharata written in telugu from the sanskrit version. ‘Aadi kavi Nannayya Bhattu’ started writing it and ‘Maha Kavi Tikkana Somayajulu’ and ‘Maha kavi Erra Pragada’ finished the great epic. These three pandits together are called ‘Kavi Triyam’ (3 poets). ‘Bhagavatam’ written by ‘Bammera Potana’; ‘Sringara Naishadam’ written by ‘Srinatha kavi’ ‘Molla Ramayanam’ written by ‘kavi Molla’ are some of the famous poets and their contribution to Telugu literature.

శతక రచనలు తెలుగు భాష లో ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. వికటకవి లాంటి పదాలు తెలుగులో ఎన్నొ. మొదటినుంచి చివరికి, చివరినుంచి మొదటికి ఎటు చదివినా ఒకేలా తలపించే కావ్యాలు, ఒకే కావ్యంతో రెండురకాల అర్ధాలను స్పురింపజేసే "ద్వర్తి" కావ్యాలు, ఒకే ఒక అక్షరంతో మొత్తం పద్యమే రాసే "ఏకాక్షర" పద్యములు మన తెలుగుకే ప్రత్యేకం. అవధాన ప్రక్రియ మన తెలుగు వారి సొత్తు.

A set of Hundred Poems related a specific topic is called as "Sataka Rachana". This is very famous in Telugu. Palindrome words like "VI KA TA KA VI" is another area of specialization for this language. A piece of literature when read from start to end tells the story of Ramayana and when read from end to start tells the story of Mahabharata. There is no other language in which such literature exist. Such literature is called ‘Dwarti’. Telugu also has single letter literature. This single letter tells the whole poem. These are called "Eka Akshara Padyamulu". “Avadhana Prakriya” is a unique feature of poetic performance in Telugu language. This involves problem-solving, composing poems from a given word spontaneously, memorising letters and their position in a sentence and a lot more.

16 వ శతాబ్దంలో విజయ నగర శ్రీకృష్ణ దేవరాయల పాలనలో తెలుగు భాష వైభవంగా వెలిగింది. సంస్కృతం నుంచి చాలా గ్రంధాలు, తెలుగు, కన్నడ భాషలలోకి అనువదించ బడ్డాయి. ఆయన సభలో "వికటకవి తెనాలి రామకృష్ణ" వంటి అష్ట దిగ్గజాలు తెలుగు భాష కు ఎనలేని వన్నె తెచ్చినారు.

‘Sri Krishnadevaraya’ of 16th century was a great ruler and scholar. He himself is a poet and a writer. During his reign, a lot of literature has been translated from Sanskrit to Telugu and Kannada. ‘Vikata kavi Tenali Ramakrishna’ and seven other scholars, were part of his court. It was treated as Golden Period for Telugu Literature.

తరువాతి కాలంలో వెల్లువలా వచ్చిన వివిధ సాహితీ ప్రక్రియలతో, పల్లె ప్రజలకు, నిరక్షరాశ్యులకు కూడా అర్ధమయ్యే వాడుక భాషలో వచ్చిన వేమన పద్యాలు, బ్రహ్మం గారి సాహిత్యం, వాగ్గేయ కారులైన అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య కీర్తనలు, కంచర్ల గోపన్న వ్ర్రాసిన శతకం, కీర్తనలు ఇప్పటికీ పండిత, పామరుల ఆదరణ పొందుతున్నాయి.

In the later period Telugu Literature was shifted from Bookish Language to Common man Language in writings. In general literature was very difficult for common man and tribes to understand. There emerged a lot of simple works like ‘Vemana padyalu’, ‘Brahmam gari sahityam’, ‘Annammayya keertanalu’, ‘Tyagaraja Keertanalu’, ‘Kshetrayya Keertanalu’, ‘Kancharla gopanna’ Satakam and keerthanalu etc.. Even today people read these works.


తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలకు నాంది పలికింది శ్రీ కందుకూరి వీరేశలింగం గారు. సామాన్య ప్రజలకు వాడుక భాషను అందించిన మార్గ దీపకులు శ్రీ గిడుగు రాంమూర్తి, గురజాడ అప్పారావు, మునిమాణిక్యం నరసింహా రావు, పానుగంటి లక్ష్మి నరసింహా రావు, చలం, ఆరుద్ర, నండూరి రామ మోహనరావు, సినారే, దాశరధి,  దేవులపల్లి, కరుణ శ్రీ, కాళోజి, గద్దర్, గోరేటి, జాషువా, ఇంకా ఎందరో మహానుభావుల వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. శ్రీశ్రీ  ఆధునిక తెలుగు భాషలో రచనలు చేసి సామాజిక స్పృహ, నూతన ఒరవడి సృష్టించారు.

‘Kandukuri Veeresa lingam garu’ is one person who has started many reforms for Telugu people. Telugu literature isn’t complete without the contribution of poets like ‘Gidugu Ramamurthy’, ‘Gurujada appa rao’ ‘Muni manikyam Narasimha rao’, ‘panuganti Lakshmi Narasimha rao’,  ‘Chalam’, ‘Aarudra’, ‘Nanduri rammohan rao’, ‘Sinare’, ‘Dasaradhi’,  ‘Devulapalli’, ‘Karuna Sri’, ‘Kaloji’, ‘Gaddar’, ‘Goreti’, ‘Jashuva’ etc,. ‘Sree Sree’ has created a new pattern of literature by writing about social awareness. Its called ‘Samajika Spruha’.

ప్రసిద్ధ శైవ క్షేత్రములైన, కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామంల మధ్య ప్రాంతములను "త్రిలింగ" ప్ర్రాంతం లేక దేశంగా పిలిచేవారు. త్రిలింగ అనే పదం నుంచి తెలుంగు తెనుగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయి. భౌగోళిక పరిస్థితులు, పాలకులభాష, కుల మతాలు, వృత్తులను బట్టి మాండలికాలు ఏర్పడినాయి. మండలము అనగా ఒక ప్రాంతం. ఆప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడే భాషను మాండళిక భాష అంటారు. ఉదాహరణకు - రాయాలసీమ భాష, కోస్తాభాష, తెలంగాభాష, తీరాంధ్రభాష, కళింగాంధ్రభాష  ...

The famous Shiva temples Kaleswaram, Srisailam, and Draksharamam form a triangle in terms of their positioning on the map and hence its called ‘Trilinga Desam’ (3 linga state). From the word, ‘Trilinga’ the words Telungu, Tenugu, and Telugu were emerged. There are different slangs in Telugu. These slangs have formed depending on the location, language of the rulers, Castes, religion, professions etc,. Example, Rayalaseema slang, Kosta Andhara slang, Telangana slang, Teera Andhra slang, Kalinga Andhra slang ...

రమారమి 11 వ శతాబ్దమునుండి, మన తెలుగు జాతిని, శాతవాహన, శక, పల్లవ, ఇక్ష్వాకు, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర, శాలివాహన, విష్ణుకుండీనుల, పలనాడు, బ్రహ్మ నాడు రెడ్డి రాజులు, కుతుబ్ షాహి, నిజాములు మొదలైన వంశాలకు చెందిన రాజులు పరిపాలించారు. క్రీ.శ. 17 వ శతాబ్దంలో బ్రిటిష్ వారు కోస్తా ఆంధ్రను ఆక్రమించుకొని మద్రాస్ రాష్ట్రం లో కలుపుకొన్నారు. 1947 లో భారత దేశానికి స్వాతంత్రం వచ్చినా, తెలుగు వారికి మాత్రం పర భాషీయుల పాలన తప్పలేదు. 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర ప్రజలు చేసిన ఉద్యమాలు, పొట్టి శ్రీరాముల లాంటి వారి ప్రాణత్యాగాల వలన దేశంలో 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డయి. ఆ విధంగా "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రంగా అవతరించింది. 2014 లో ఆంధ్ర ప్రదేశ్ ను రెండు రాష్ట్రాలు గా విభజించి తెలంగాణా రాష్ట్రం, ఆంధ్ర ప్రదేశ్ అవతరించాయి. తెలంగాణా రాజధాని హైదరాబాద్, ఆంధ్ర ప్రదెశ్ రాజధాని అమరావతి.

Telugu land has been ruled by multiple kings and kingdoms since the 11th century. The kingdoms who ruled the Telugu land are: Satavahana, Saka, Pallava, Ikshavaku, Chola, Chalukya, Kakateeya, Vijayanagara, Salivahana, Vishnukundeenulu, Palanadu, Brahma Nadu, Reddy Rajulu, Kutubshahi, Naizams. In 17th century, the British has merged the coastal Andhra into the Madras state. From 1953 to 1956, Telugu speaking people revolted under the leadership of ‘Shree Potti Sriramulu‘, who sacrificed his life for the state. ‘Andhra Pradesh’ was formed in the year 1956. Recently in 2014, Andhra Pradesh has been divided into Telangana State and Andhra State with Hyderabad and Amaravati respectively as their state capitals.

తెలుగు రాష్ట్రం లో చారిత్రాత్మక కట్టడాలు, సహజ సంపదలు, శిల్ప సౌందర్య దేవాలయాలు, నృత్య, సంగీత, చేనేత, హస్త కళలు, ఆంధ్ర పిండివంటలు, సాంస్కృతిక, సాంప్రదాయాలు, మొదలైనవి ఎన్నో వున్నాయి.

The Land of Telugu is famous for Historical Monuments, Natural Resources, Sculpture, Artistic Temples, Dance, Music, Handlooms, Handicrafts, Festivals, Cultural and Social activities and even mouth watering food.

ఎందరో మహాను భావులు - అందరికి వందనాలు.
So many Great People - Salutations to them All.